హైదరాబాద్‌లో దారుణం.. కొడుకును తుపాకితో కాల్చి చంపిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి

  • 22 ఏళ్ల కుమారుడిని తుపాకితో దారుణంగా కాల్చి చంపిన తండ్రి
  •  ఘటనకు ముందు తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ
  • నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కన్న కుమారుడుని తండ్రి తుపాకితో కాల్చి చంపాడు. నగరంలోని నేరేడ్‌మెట్ బాలాజీ నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన మహారుద్దీన్ ఓ బ్యాంకులో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, ఏమైందో తెలియదు కానీ 22 ఏళ్ల తన కుమారుడు సోహైల్‌ను ఒక్కసారిగా తుపాకితో కాల్చి చంపాడు.

తుపాకి శబ్దం విని వచ్చిన ఇరుగు పొరుగువారికి అప్పటికే రక్తపు మడుగులో ఉన్న సోహైల్ కనిపించాడు. ఈ ఘటనకు ముందు తండ్రీ కొడుకుల మధ్య ఏదో విషయంలో ఘర్షణ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోహైల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహారుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Telangana
Army officer
shoot out
murder

More Telugu News